బాలినేని టీడీపీలోకి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది: గోనె ప్రకాశ్ రావు

Gone Prakash Rao fires on Balineni Srinivasa Reddy
  • బాలినేనిని వందల కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలన్న గోనె
  • వైవీ సుబ్బారెడ్డి దయవల్లే బాలినేని ఎమ్మెల్యే అయ్యారని వ్యాఖ్య
  • వైవీ సుబ్బారెడ్డిని విమర్శించవద్దని సూచన
వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు బాలినేనిపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. బాలినేనికి వందల కోట్లు ఎలా వచ్చాయో ఆయనే చెప్పాలని అన్నారు. విదేశాల్లో గ్యాంబ్లింగ్ లు ఆడిన చరిత్ర బాలినేనిదని... గ్యాంబ్లింగ్ కోసం స్పెషల్ ఫ్లైట్లలో కూడా వెళ్లారని తెలిపారు. 

వైఎస్ రాజశేఖరరెడ్డి ఎదుగుదలలో కేవీపీ రామచంద్రరావు, వైవీ సుబ్బారెడ్డిల పాత్ర ఉందని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి దయవల్లే బాలినేని ఎమ్మెల్యే అయ్యారని అన్నారు. అలాంటి వైవీ సుబ్బారెడ్డిని ఆడిపోసుకోవద్దని సూచించారు. బాలినేని టీడీపీలోకి వెళ్తున్నారనే ప్రచారం కూడా జరుగుతోందని అన్నారు. టీడీపీలోకి వెళ్తే వెళ్లండి కానీ... వైవీ సుబ్బారెడ్డిని మాత్రం విమర్శించవద్దని చెప్పారు.
Advertisement
Gone Prakash Rao
Balineni Srinivasa Reddy
YV Subba Reddy
YSRCP

More Telugu News