AP 40G: ఏపీలో ప్రభుత్వ వాహనాలకు ఇకపై కొత్త నెంబరు సిరీస్

New number series for govt vehicles in AP
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో ఇకపై ప్రభుత్వ వాహనాలకు కొత్త సిరీస్ తో నెంబర్లు కేటాయించనున్నారు. అందుకోసం మోటార్ వాహనాల చట్టంలో సవరణ తీసుకురానున్నారు. ఆ మేరకు రాష్ట్ర రవాణా శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తెలియజేయాలని కోరింది. ఈ చట్ట సవరణ అనుసరించి ప్రభుత్వ వాహనాలకు AP 40G అనే సిరీస్ తో నెంబర్లు కేటాయించనున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ ప్రత్యేక సిరీస్ ను కేటాయిస్తారు. 2018 నుంచి రవాణా శాఖ అన్ని జిల్లాలకు కలిపి AP 39 సిరీస్ లో నెంబర్లు కేటాయిస్తోంది. ఇక మీద నూతన రిజిస్ట్రేషన్ సిరీస్ తీసుకురావడంతో ప్రైవేటు వాహనాలకు, ప్రభుత్వ వాహనాలకు తేడా స్పష్టంగా తెలుసుకోవచ్చు.
Go Back to Shorts
AP 40G
Series
Number
Govt Vehicles
Andhra Pradesh

More Telugu News