తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అనలాగ్ పన్నీర్‌పై నిషేధం

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అనలాగ్ పన్నీర్‌పై నిషేధం

Telangana Government Key Decision Ban On Analog Paneer
  • ప్రజారోగ్యం దృష్ట్యా సర్కార్ కీలక నిర్ణయం
  • తయారీ, అమ్మకాలపై ఏడాది పాటు నిషేధం విధింపు
  • సెప్టెంబర్ 10 నుంచి అమల్లోకి వచ్చిన ఉత్తర్వులు
ప్రజారోగ్య పరిరక్షణ దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 'అనలాగ్' (కృత్రిమ) పన్నీర్‌పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధం ఏడాది పాటు అమల్లో ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. పన్నీర్ పేరిట విక్రయిస్తున్న నాణ్యత లేని, కల్తీ ఉత్పత్తుల వల్ల ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతున్న నేపథ్యంలో ఈ కఠిన చర్యలు చేపట్టింది.

పన్నీర్ పేరుతో చలామణి అవుతున్న డైరీయేతర, కృత్రిమ ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, రవాణా, పంపిణీ మరియు విక్రయాలపై ఈ నిషేధం వర్తిస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ఆహార భద్రతా విభాగం (టీజీ సేఫ్) ఉత్తర్వులు జారీ చేసింది. 2026 సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఈ ఆదేశాలు రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి వచ్చాయి.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006లోని సెక్షన్ 30(2)(a) ప్రకారం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఉత్తర్వులతో రాష్ట్రంలో కల్తీ పన్నీర్ తయారీ, విక్రయాలకు అడ్డుకట్ట పడనుంది.
Advertisement
Telangana Government
Analog Paneer Ban
Artificial Paneer
Food Safety Authority
Adulterated Paneer

More Telugu News