చాలా రోజుల తర్వాత ముంబైలో కనిపించిన ఛార్మీ, పూరీ జగన్నాథ్
- 'లైగర్' ఫ్లాప్ తర్వాత సైలెంట్ అయిన ఛార్మీ, పూరీ
- ముంబై ఎయిర్ పోర్టులో కనిపించిన జంట
- అక్కడకు ఎందుకు వెళ్లారనే విషయంలో రావాల్సిన క్లారిటీ
అలాంటి వీరు తాజాగా ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు. ఎయిర్ పోర్టులో వీరు ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరు ముంబైకి ఎందుకు వెళ్లారనే విషయంలో అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు. బాలీవుడ్ లో ఏదైనా కొత్త ప్రాజెక్టు కోసం వెళ్లారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ వీరిద్దరూ మళ్లీ బహిరంగంగా కనిపించేసరికి సినీ అభిమానుల్లో జోష్ వచ్చింది. మరో కొత్త సినిమాను పట్టాలెక్కిస్తున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.