Dhanush: ధనుశ్ సినిమా రెండు భాషల్లో రాబట్టిన వసూళ్లు ఇవే!

  • ధనుశ్ సినిమాగా ఈ నెల 17న వచ్చిన 'సార్'
  • తమిళంలో 'వాతి' టైటిల్ తో పలకరించిన సినిమా 
  • రెండు భాషల్లోను కలుపుకుని 75 కోట్లు దాటిన గ్రాస్ 
  • 100 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతున్న తీరు

Sir Movie Update

ధనుశ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' సినిమా రూపొందింది. సూర్యదేవర నాగవంశీ - త్రివిక్రమ్ కలిసి నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 17వ  తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో 'వాతి' టైటిల్ తోను ఈ సినిమా అదే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది ఒక వీకెండ్ మాత్రమే చూసే సినిమా కాదు నాని వెంకీ అట్లూరి చెప్పినట్టుగానే దూసుకుపోతోంది. 

సంయుక్త మీనన్ కథనాయికగా నటించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో 8 రోజుల్లో 24.21 కోట్ల రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక తమిళ వెర్షన్ కి సంబంధించిన వసూళ్లను కూడా కలుపుకుంటే ఈ సినిమా 75 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టినట్టుగా ప్రకటించారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు.  

ప్రైవేటు విద్యా సంస్థలు సామాన్య కుటుంబాలకి చెందిన విద్యార్థుల జీవితాలతో ఎలా ఆడుకుంటున్నాయనేది ఈ సినిమాలో చూపించారు. కాకపోతే సామాన్యుల పిల్లలు సాధించిన సక్సెస్ విషయంలో హీరో తీసుకున్న నిర్ణయం అంత కరెక్ట్ కాదేమో అనే టాక్ వినిపించింది. ఏదేమైనా ఈ సినిమా 100 కోట్ల దిశగా పరుగులు తీస్తుండటం విశేషం.

More Telugu News