Nara Lokesh: తార‌క‌ర‌త్న‌ భౌతికకాయానికి నివాళులు అర్పించిన లోకేశ్, బ్రాహ్మ‌ణి

Tarakaratna passes away lokesh brahmani offers condolences
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్, ఆయ‌న స‌తీమ‌ణి బ్రాహ్మణి అశ్రున‌య‌నాల‌తో నంద‌మూరి తార‌క‌ర‌త్న పార్థివ‌దేహానికి నివాళులు అర్పించారు. తార‌క‌ర‌త్న మృతి స‌మాచారం తెలుసుకుని పాద‌యాత్ర‌కు విరామం ఇచ్చిన లోకేశ్ హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. అనంతరం..తన సతీమణితో క‌లిసి మోకిల నివాసానికి చేరుకుని తారకరత్నకు నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటం వద్ద పుష్ఫాలు ఉంచి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టించారు. తారకరత్న కుటుంబ‌స‌భ్యుల్ని ప‌రామ‌ర్శించారు. 

తారకరత్న గత కొన్ని రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి కన్నుమూశారు. జనవరి 27న లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంగా తారకరత్న ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయనను చికిత్స కోసం బెంగళూరుకు తరలించారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. తారకరత్న మృతిపై ప్రధానితో సహా పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 
Go Back to Shorts
Nara Lokesh

More Telugu News