Manchu Manoj: తారకరత్నను చూసి కంటతడి పెట్టుకున్న మంచు మనోజ్

Manchu Manoj shed tears after seeing Tarakatna
షార్ట్స్‌లో చూడండి
నందమూరి తారకరత్న గత నాలుగు రోజులుగా ప్రాణాలతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో ఆయనకు స్పెషలిస్ట్ డాక్టర్లతో కూడిన బృందం చికిత్సను అందిస్తోంది. మరోవైపు ఆయనను కుటుంబసభ్యులు పరామర్శిస్తున్నారు. బాలకృష్ణ అక్కడే ఉండి అన్నీ చూసుకుంటున్నారు. మరోవైపు, సినీ నటుడు మంచు మనోజ్ కూడా ఆసుపత్రికి వెళ్లి తారకరత్నను పరామర్శించారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తన స్నేహితుడు తారకరత్నను ఆ పరిస్థితుల్లో చూడగానే ఆయన కంటతడి పెట్టుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న, మంచు మనోజ్ మంచి స్నేహితులు. అన్నదమ్ముల్లా వీరు కలిసి ఉంటారు.
Go Back to Shorts
Manchu Manoj
Taraka Ratna
Tollywood

More Telugu News