తొలిసారి పోలీస్ పాత్రలో ప్రభాస్... ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి 'స్పిరిట్'

Update for Prabhas Spirit movie
  • అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వంలో 'స్పిరిట్'
  • ప్రస్తుతం 'యానిమల్' చిత్రంతో సందీప్ వంగా బిజీ
  • 'యానిమల్' పూర్తయిన తర్వాత స్పిరిట్ షురూ అవుతుందన్న నిర్మాత
టాలీవుడ్ అగ్రకథానాయకుడు ప్రభాస్, 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ వంగా కాంబోలో 'స్పిరిట్' చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పుడు అప్ డేట్ వచ్చింది. స్పిరిట్ చిత్రం ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళుతుందని నిర్మాత భూషణ్ కుమార్ వెల్లడించారు. ఈ చిత్రం ద్వారా ప్రభాస్ తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. దాంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. 

సందీప్ వంగా ప్రస్తుతం యానిమల్ చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నారని, ఆ సినిమా పూర్తికాగానే 'స్పిరిట్' ప్రారంభమవుతుందని నిర్మాత వివరించారు. ఈ పోలీస్ డ్రామా చిత్రంలో ప్రభాస్ కొత్తగా కనిపించడం ఖాయమని చెప్పారు. 'స్పిరిట్' చిత్రానికి సంగీతం స్పెషల్ అట్రాక్షన్ అని తెలిపారు. 

ప్రభాస్ ప్రస్తుతం కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో 'సలార్', బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తో 'ఆదిపురుష్' చిత్రాలు చేస్తున్నారు. అటు, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె' చిత్రంలోనూ నటిస్తున్నారు. 

అయితే, ప్రభాస్ ను పోలీస్ పాత్రలో చూసేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే 'స్పిరిట్' చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందా? ప్రభాస్ ను ఎప్పుడు ఖాకీ డ్రెస్ లో చూస్తామా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Go Back to Shorts
Prabhas
Spirit
Sandeep Vanga
Bhushan Kumar
Tollywood

More Telugu News