బీజేపీకి ఈ ఏడాదిలోనే అసలైన సినిమా చూపిస్తాం: కేటీఆర్

KTR once again scathing attack on BJP
  • సెస్ ఎన్నికల్లో చూపించింది ట్రైలర్ మాత్రమేనన్న కేటీఆర్
  • కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రమే పోషిస్తోందని పునరుద్ఘాటన
  • తప్పయితే రాజీనామా చేస్తానని సవాల్ 
  • లేదంటే మీరు రాజీనామా చేస్తారా? అంటూ బీజేపీ నేతలకు సవాల్
తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై మరోసారి ధ్వజమెత్తారు. సెస్ (సహకార విద్యుత్ సరఫరా సంఘం) ఎన్నికల్లో చూపించింది ట్రైలర్ మాత్రమేనని, బీజేపీకి ఈ ఏడాదిలోనే అసలైన సినిమా చూపిస్తామని వ్యాఖ్యానించారు. 

కేంద్రం నిధులపై తన సవాల్ కు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్రమే పోషిస్తోందని అన్నారు. ఇది తప్పయితే రాజీనామా చేసి వెళ్లిపోతా... లేదంటే మీరు రాజీనామా చేస్తారా? అంటూ మరోసారి సవాల్ విసిరారు. 

బీజేపీని నడిపించేది మూర్ఖులు అని విమర్శించారు. మేము ఉద్యోగాలు ఇస్తుంటే బండి సంజయ్ వద్దంటారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. బండి సంజయ్ కి అసలు తెలివి, మెదడు అనేవి ఉన్నాయా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ కు ఎంపీగా బండి సంజయ్ ఏంచేశారో చెప్పాలని నిలదీశారు. 

వేములవాడకు మోదీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మోదీ దేవుడంటూ బీజేపీ నేతలు డబ్బాలు కొడుతున్నారని విమర్శించారు.
Advertisement
KTR
BRS
BJP
Telangana

More Telugu News