పోలీస్ రిక్రూట్ మెంట్ నిబంధనలను ఎందుకు మార్చారు?: బండి సంజయ్
- నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న బండి సంజయ్
- పోలీస్ అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపాటు
- ఇప్పటికైనా నిబంధనలను మార్చాలని డిమాండ్
లాంగ్ జంప్, షార్ట్ పుట్ పరీక్షల్లో ఏ రాష్ట్రంలోనూ లేని నిబంధనలను పొందుపరిచారని అన్నారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ లో కూడా ఈ స్థాయిలో నిబంధనలు లేవని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో లాంగ్ జంప్ డిస్టెన్స్ 3.8 మీటర్లు ఉండగా తెలంగాణలో మాత్రం 4 మీటర్లుగా నిర్ణయించారని విమర్శించారు. 4 మీటర్లుగా నిర్ణయించడం వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా నిబంధనలను మార్చాలని... లేకపోతే ప్రభుత్వాన్ని యువత క్షమించదని చెప్పారు.