రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడైన కృష్ణకుమార్ కన్నుమూత
- 1963లో టాటా గ్రూపులో అడుగుపెట్టిన కృష్ణకుమార్
- గ్రూపులోని పలు కంపెనీలకు టాప్ పొజిషన్ లో పని చేసిన వైనం
- ఈ సాయంత్రం ముంబైలో అంత్యక్రియలు
టాటా సంస్థలకు రిటైర్ మెంట్ ప్రకటించిన తర్వాత కూడా గ్రూప్ కు సంబంధించిన పలు కీలక నిర్ణయాల్లో ఆయన కీలక భూమికను నిర్వహించారు. రతన్ టాటాది, కృష్ణకుమార్ ది ఒకే వయసు కావడంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం కొనసాగింది. 2009లో కృష్ణకుమార్ ని భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆయన అంత్యక్రియలు ఈ సాయంత్రం ముంబైలోని చందన్ వాడీ శ్మశానవాటికలో జరగనున్నాయి.