బాపట్ల జిల్లాలో విజయవాడ–ఒంగోలు హైవే పై దిగనున్న విమానాలు
- 16వ నంబర్ హైవేపై 4 కిలోమీటర్లను ఎయిర్ పాడ్ గా తీర్చిదిద్దిన వైనం
- అత్యవసర సమయాల్లో ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు
- ఈ నెల 29న ట్రయల్ రన్
బాపట్ల జిల్లా జె. పంగులూరు మండలం రేణింగవరం, కొరిశపాడు గ్రామాల మధ్య హైవేపై 4 కిలోమీటర్ల మేర విమానాలు దిగేలా సిమెంట్ రోడ్డు వేశారు. ఈ నెల 29వ తేదీన దీనిపై ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 11 గంటల ప్రాంతాల్లో ఒక కార్గో విమానంతో పాటు రెండు ఫైటర్ జెట్ విమానాలు దిగుతాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో హైవే, సమీపంలోకి ఇతర వాహనాలు రాకుండా ట్రాఫిక్ ను మళ్లిస్తామని అధికారులు తెలిపారు.