రేవంత్ పై సీనియర్ల తిరుగుబాటుతో కాంగ్రెస్ లో కలకలం.. రంగంలోకి అధిష్ఠానం!
- కొత్త కమిటీ ఎంపికతో తారస్థాయికి విభేదాలు
- రేవంత్ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సీనియర్ల నిర్ణయం
- ఢిల్లీ రావాలని సీనియర్లకు అధిష్ఠానం పిలుపు
దీనికి రేవంత్ రెడ్డినే కారణం అని, ఆయనపై హైకమాండ్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 20న ఏలేటి మహేశ్వర రెడ్డి ఇంట్లో మరోసారి సమావేశం కానున్నారు. రేవంత్ నిర్వహించే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ వివాదంపై కాంగ్రెస్ హైకమాండ్ కు ఇప్పటికే సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఏఐసీసీ కార్యదర్శులు రాష్ట్రానికి రానున్నారు. ఇక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై ఆరా తీసినట్లు తెలిసింది. కేసీ వేణుగోపాల్ నుంచి నివేదిక కోరినట్టు, రేవంత్ పై తిరుగుబాటు ప్రకటించిన సీనియర్లను ఢిల్లీ రావాలని అధిష్ఠానం ఆదేశించినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వివాదం ఎంత దూరంలో వెళ్తుందో చూడాలి.