'ఆహా'లో అనిల్ రావిపూడి 'కామెడీ స్టాక్ ఎక్చేంజ్' .. ప్రోమో రిలీజ్!

Comedy Stock Exchange promo released
  • 'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై కామెడీ షో 
  • న్యాయమూర్తిగా అనిల్ రావిపూడి 
  • యాంకర్స్ గా సుడిగాలి సుధీర్ - దీపిక పిల్లి
  • డిసెంబర్ 2న ఫస్టు ఎపిసోడ్ స్ట్రీమింగ్ 
  • సందడి చేస్తున్న ప్రోమో  
'ఆహా'లో వినోదం పాళ్లు పెంచుతూ వెళుతున్నారు. ఒక వైపున సినిమాలు .. మరో వైపున వెబ్ సిరీస్ లు .. టాక్ షోలు నెటిజన్లకు కావలసిన ఎంటర్టయిన్మెంట్ ను పుష్కలంగా అందిస్తున్నాయి. తాజాగా ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా ఓ కామెడీ షోను అందించడానికి రంగం సిద్ధమైంది. ఈ కామెడీ షోకి అనిల్ రావిపూడి న్యాయనిర్ణేతగా వ్యవహరించడం విశేషం. అనిల్ రావిపూడి విషయానికి వస్తే, ఇంతవరకూ ఆయన చేసిన సినిమాలన్నీ హిట్లే. అన్ని సినిమాల్లోను కామెడీ పరంగానే ఆయనకి ఎక్కువ మార్కులు దక్కాయి. కామెడీపై ఆయనకి మంచి పట్టు ఉందనే విషయాన్ని ఆ సినిమాలు నిరూపించాయి. అందువలన ఈ కామెడీ షో కోసం న్యాయ నిర్ణేతగా ఆయనను తీసుకున్నారు. 

అనిల్ రావిపూడి చేసిన ఈ కామెడీ షో పేరు 'కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్'. డిసెంబర్ 2వ తేదీన ఫస్టు ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, అందుకు సంబంధించిన 'ప్రోమో'ను వదిలారు. సుడిగాలి సుధీర్ - దీపికా పిల్లి యాంకర్స్ గా వ్యవహరిస్తుండగా,  'జబర్డస్త్' .. 'పటాస్' షోస్ ద్వారా పాప్యులర్ అయిన కమెడియన్స్ సందడి చేయనున్నారు.
Go Back to Shorts
Anil Ravipudi
Sudigali Sudheer
Dipeeka Pilli
Comedy Stock Exchange

More Telugu News