మహేశ్ ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ: అనిల్ రావిపూడి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ: అనిల్ రావిపూడి

Anil Ravipudi Interview
  • బాలయ్యతో సినిమాకి అనిల్ రావిపూడి సన్నాహాలు 
  • భక్తి కంటెంట్ తోను చేయాలనుందన్న అనిల్ 
  • మహేశ్ తో మరో సినిమా చేయాలనుందని వెల్లడి 
  • మెగా హీరోల సినిమాలను వదులుకోనని వ్యాఖ్య  
అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలకృష్ణతో సినిమాకి సన్నాహాలు చేసుకుంటున్నాడు. వచ్చేనెల మొదటివారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అందుకు సంబంధించిన సన్నాహాలు చురుకుగా జరుగుతున్నాయి. అయితే ఆ తరువాత సినిమాలను గురించి ఆయన తాజా ఇంటర్వ్యూలో ప్రస్తావించాడు. 

"ఇప్పుడు ఎక్కడ చూసినా డివోషనల్ ట్రెండ్ మొదలైనట్టుగా అనిపిస్తోంది. 'అఖండ' .. 'కార్తికేయ 2' .. 'ఆది పురుష్ .. 'హనుమాన్' ఇలా వరుసగా డివోషనల్ టచ్ తో కూడిన సినిమాలు వస్తున్నాయి. నాకు కూడా ఆ తరహా సినిమాలు చేయాలని ఉంది. అయితే అందుకు రెండుమూడేళ్లు పట్టొచ్చని అనుకుంటున్నాను" అన్నాడు. 

"ఇక  మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో సాయితేజ్ తోను .. వరుణ్ తేజ్ తోను సినిమాలు చేశాను. మిగతా మెగా హీరోలతో కూడా చేయాలని ఉంది. అందుకు పరిస్థితులు అనుకూలించాలి. ఇక మహేశ్ బాబుగారితో మళ్లీ ఎప్పుడని అంతా అడుగుతున్నారు. ఆయన ఎప్పుడంటే అప్పుడే అనేది నా సమాధానం" అంటూ ముగించాడు.
Anil Ravipudi
Mahesh Babu
Tollywood

More Telugu News