Prabhas: ప్రభాస్ సినిమాకు రూ. 40 కోట్లతో భారీ సెట్లు

Rs 40 Cr sets for Prabhas movie
షార్ట్స్‌లో చూడండి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ దీపికా పదుకుణే జంటగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'ప్రాజెక్ట్ కే'. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, దిశా పటానీలు కీలక పాత్రలను పోషిస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. 

మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న షెడ్యూల్ కు సంబంధించి దాదాపు రూ. 40 కోట్ల వ్యయంతో నాలుగు సెట్లను రూపొందించినట్టు సమాచారం. ఈ సెట్లలో భారీ పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్స్ కోసం విదేశాల నుంచి ఫైటర్స్ ను రప్పించారట. ఈ చిత్రం 2024లో రిలీజ్ కానుంది. అశ్వనీదత్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
Go Back to Shorts
Prabhas
Deepika Padukone
Nag Ashwin
Project K
Movie Sets

More Telugu News