ఏపీలో చింతూరు కేంద్రంగా మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు
- అల్లూరి సీతారామరాజు జిల్లాలో కొత్తగా రెవెన్యూ డివిజన్
- చింతూరు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- చింతూరు, ఏటిపాక, కూనవరం, వర రామచంద్రాపురం మండలాలతో కొత్త రెవెన్యూ డివిజన్
- చింతూరుతో 74కు చేరిన రెవెన్యూ డివిజన్ల సంఖ్య
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇప్పటిదాకా పాడేరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లు మాత్రమే ఉన్నాయి. అయితే చింతూరుతో పాటు ఏటిపాక, కూనవరం, వర రామచంద్రాపురం మండలాలకు చెందిన ప్రజలు తమకు మరో కొత్త రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేయాలని చాలా కాలంగా కోరుతున్నారు. వీరి డిమాండ్లను పరిశీలించిన ప్రభుత్వం చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేసింది. ఈ రెవెన్యూ డివిజన్ తో 3 మండలాల ప్రజలకు పాలనా పరంగా భారీ ఊరట లభించనుంది.