'జిన్నా' దగ్గర నకరాల్ జేస్తే ఇట్లుంటది.. లిరికల్ సాంగ్ రిలీజ్!
- 'జిన్నా'గా మంచు విష్ణు
- రొమాంటిక్ ఎంటర్టయినర్ జోనర్లో నడిచే కథ
- కథానాయికలుగా పాయల్ - సన్నీ లియోన్
- త్వరలోనే ప్రేక్షకుల ముందుకు
కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. "నా పేరు జిన్నారా .. అందరికీ అన్నరా .. నకరల్ జేస్తే కిస్సా ఖల్లాసు రా .. " అంటూ ఈ పాట సాగుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి ప్రేమ్ సాహిత్యాన్ని అందించగా పృథ్వీ చంద్ర ఆలపించాడు.
హీరో స్వభావం .. ఆయన ధైర్య సాహసాలను గురించి స్తుతించే స్టైల్లో ఈ పాట సాగుతోంది. 'జిన్నాభాయ్' పాత్రను మాస్ ఆడియన్స్ కి చేరువగా తీసుకుని వెళ్లడానికి విష్ణు గట్టిగానే ట్రై చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు.