Puri Jagannadh: పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్య

Puri Jagannadh assistant director commits suicide
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ లోని దుర్గం చెరువులోకి దూకి బలవన్మరణం పొందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

పూరీ జగన్నాథ్ వద్ద సాయికుమార్ పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినట్టు తెలుస్తోంది. అప్పుల బాధను తట్టుకోలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెపుతున్నారు. సాయికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, ప్రస్తుతం పూరీ జగన్నాథ్ వద్ద సాయికుమార్ పని చేస్తున్నాడా? లేదా? అనే విషయం తెలియాల్సివుంది.
Go Back to Shorts
Puri Jagannadh
Tollywood
Assistant Director
Suicide

More Telugu News