'లైగర్' ఎఫెక్ట్.. ముంబై నుంచి షిఫ్ట్ అవుతున్న పూరీ జగన్నాథ్
- 'లైగర్' కోసం ముంబైకి మకాం మార్చిన పూరీ జగన్నాథ్
- నెలకు రూ. 10 లక్షల అద్దె
- పూరీకి నష్టాలను మిగిల్చిన 'లైగర్'
ప్రమోషన్స్ సమయంలో కూడా ఈ సినిమాకు పెద్ద హైప్ క్రియేట్ అయింది. కానీ తీరా విడుదలయ్యాక అంచనాలను అందుకోలేక చతికిల పడింది. ఈ సినిమాతో పూరీ జగన్నాథ్ కు భారీ నష్టాలు వచ్చాయి. దీంతో, ముంబైలో ఆ భవనానికి అద్దె కట్టడాన్ని భారంగా భావించిన ఆయన... తన మకాంను అక్కడి నుంచి హైదరాబాద్ కు మార్చే పనిలో ఉన్నారని చెపుతున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండతోనే 'జనగణ మన' తీయాలని పూరీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయినట్టు ప్రచారం జరుగుతోంది.