కాంగ్రెస్ పార్టీలోకి నటి త్రిష?... తమిళనాట జోరుగా చర్చ!
- దక్షిణాది భాషా చిత్రాల్లో రాణించిన త్రిష
- విజయ్ సేతుపతి సూచన మేరకు రాజకీయాలపై ఆసక్తి
- ఖుష్బూ ఖాళీ చేసిన స్థానాన్ని భర్తీ చేయాలని తలంపు
ఈ క్రమంలోనే సినీ రంగంలో మంచి గుర్తింపు సంపాదించుకుని ఆ తర్వాత రాజకీయాల్లో సత్తా చాటిన మాజీ సీఎం జయలలిత, బీజేపీ నేత ఖష్భూల ప్రస్తావన తీసుకొచ్చిన విజయ్... మీరు కూడా రాజకీయాల్లోకి వెళ్లండని త్రిషకు సలహా ఇచ్చినట్లుగా సమాచారం. ఈ సలహా మేరకు రాజకీయ తెరంగేట్రంపై దృష్టి సారించిన త్రిష... కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఖుష్బూ ఆదిలో కాంగ్రెస్‌తోనే రాజకీయాల్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే ఆమధ్యే ఆమె కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఈ క్రమంలో తమిళనాడుకు సంబంధించి కాంగ్రెస్‌లో చేరితే మంచి అవకాశాలు చేజిక్కించుకోవచ్చనే అంచనాలతో త్రిష సాగుతున్నట్లు సమాచారం.