మీటింగ్ లో ఉండగా బెదిరింపు కాల్.. స్పీకర్ ఆన్ చేసి అందరికీ వినిపించిన టీడీపీ నాయకురాలు అనిత!
- విజయవాడలో మహిళా హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్
- గోరంట్ల మాధవ్ గురించి ఎక్కువగా మాట్లాడొద్దని ఫోన్ ద్వారా అనితకు బెదిరింపులు
- తాను వాస్తవాలనే మాట్లాడుతున్నానన్న అనిత
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ గురించి ఎక్కువగా మాట్లాడొద్దని ఫోన్ చేసిన వ్యక్తి అనితను బెదిరించారు. తాను వాస్తవాలనే ప్రజలకు వివరిస్తున్నానని ఆమె సమాధానం ఇచ్చారు. మాధవ్ గురించి స్పందించాల్సిన అవసరం లేదని ఆయన హెచ్చరించారు. ఈ ఫోన్ కాల్ ను స్పీకర్ ఆన్ చేసి అనిత అందరికీ వినిపించారు. 9848075369 నంబర్ నుంచి తనకు బెదిరింపు కాల్ వచ్చిందని ఆమె చెప్పారు.