Advertisement

26 రోజుల పోరాటం తర్వాత కూడా నా నీతిని నిరూపించుకోవాలా?: సోనమ్ వాంగ్‌చుక్

Sonam Wangchuk asks if he must prove integrity after 26 day fast
  • వీడియో సందేశాన్ని విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్ 
  • దీక్ష విరమణపై వస్తున్న విమర్శలు, పొలిటికల్ 'డీల్' ఆరోపణలపై అసహనం 
  • దీక్ష వల్ల 11 కిలోల బరువు తగ్గడంతో పాటు అవయవాలపై తీవ్ర ప్రభావం పడిందని వెల్లడి 
  • మంత్రుల సమక్షంలోనే దీక్ష విరమించడంపై  వచ్చిన విమర్శలకు వివరణ 
  • విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు నిరసనలు ఆగవన్న 'కాక్రోచ్ జనతా పార్టీ'
నీట్ పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమానికి మద్దతుగా 26 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ఉద్యమకారుడు  సోనమ్ వాంగ్‌చుక్.. తనపై వస్తున్న విమర్శలకు స్పందించారు. ఆసుపత్రి బెడ్ పైనుంచే వీడియో సందేశాన్ని విడుదల చేశారు. 

సుదీర్ఘమైన దీక్ష కారణంగా 11 కిలోల బరువు తగ్గడంతో పాటు శరీరం తీవ్రంగా క్షీణించి, అవయవాల పనితీరుపై తీవ్ర ప్రభావం పడిందని ఆ వీడియోలో వాంగ్‌చుక్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌ల చేతుల మీదుగా ద్రవాహారం తీసుకుని దీక్ష విరమించడంపై వస్తున్న విమర్శలకు ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు. "26 రోజుల పాటు ఆకలితో అలమటించిన తర్వాత కూడా నేను నా స్వచ్ఛతకు నిరూపణలు సమర్పించుకోవాలా? ప్రభుత్వంతో డీల్ కుదుర్చుకోవాలనుకుంటే ఢిల్లీ మండుటెండల్లో రోడ్డుపై కూర్చుని నెల రోజులు పస్తులుండాల్సిన అవసరం లేదు, ఏ ప్రశాంతమైన ఏసీ గదిలోనో చర్చలు జరుపుకునేవాడిని" అని విమర్శకుల నోళ్లు మూయించారు.

అటు కేంద్ర ప్రభుత్వం పేపర్ లీకేజీలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, కఠిన చట్టాల హామీలు ఇచ్చినప్పటికీ.. 'తమ పోరాటాన్ని ఆపేది లేదని సీజేపీ స్పష్టం చేసింది. సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వల్ల ఆయన దీక్ష విరమించడాన్ని తాము స్వాగతిస్తున్నామని, అయితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద తమ నిరసన ప్రదర్శనలు కొనసాగుతాయని పార్టీ ప్రతినిధి అశుతోష్ రాంకా ప్రకటించారు.
Advertisement
Sonam Wangchuk
NEET exam irregularities
Cockroach Janata Party
Delhi hunger strike
Paper leak protest
Dharmendra Pradhan resignation

More Telugu News