ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకల వేళ.. గోరంట్ల మాధవ్ నగ్న ప్రదర్శనలు చూడాల్సి వస్తోంది: సోమిరెడ్డి
- రేప్ కేసుల్లో ముద్దాయిలకు జగన్ అవార్డులు, రివార్డులు ఇస్తున్నారన్న సోమిరెడ్డి
- కియా కంపెనీ ప్రతినిధులతో నీచంగా ప్రవర్తించినప్పుడే మాధవ్ ను ఇంటికి పంపాల్సిందని వ్యాఖ్య
- వైసీపీ నేతల భాషతో ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారన్న సోమిరెడ్డి
ఇలా సరససల్లాపాల్లో పాలుపంచుకుంటూ రేప్ కేసుల్లో ముద్దాయిలైన వ్యక్తులకు అవార్డులు, రివార్డులు ఇవ్వడం సీఎం జగన్ కు అలవాటుగా మారిందని విమర్శించారు. కియా కంపెనీ ప్రతినిధులతో నీచంగా ప్రవర్తించినప్పుడే ఇలాంటి దుర్మార్గులను ఇంటికి పంపి ఉండాల్సిందని అన్నారు. వైసీపీ నేతల ప్రవర్తన, వాడుతున్న భాషను చూసి సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితుల్ని ప్రజలకు తెచ్చారని మండిపడ్డారు. ఒకప్పుడు అభివృద్ధికి రోల్ మోడల్ గా నిలిచిన ఏపీ ఈరోజు వైసీపీ నేతల దుర్మార్గాలు, దోపిడీలకు కేరాఫ్ అడ్రస్ గా మారడం దురదృష్టకరమని అన్నారు.