భీమ‌వ‌రంలో అల్లూరి విగ్ర‌హానికి ప‌వ‌న్ నివాళి... వీడియో ఇదిగో

pawan kalyan trubetes to alluri statue in bhimavaram
  • జ‌న‌వాణి కోసం భీమ‌వ‌రం వెళ్లిన ప‌వ‌న్‌
  • ఈ నెల 4న భీమ‌వ‌రంలో అల్లూరి విగ్ర‌హావిష్క‌ర‌ణ‌
  • ప్ర‌ధాని మోదీ కార్య‌క్ర‌మానికి ఆహ్వానం ఉన్నా హాజ‌రుకాని ప‌వ‌న్‌
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆదివారం ఉద‌యం అల్లూరి సీతారామారాజు విగ్ర‌హానికి నివాళి అర్పించారు. జ‌న‌సేన ఆధ్వ‌ర్యంలో ఇటీవ‌లే ప్రారంభ‌మైన జ‌న‌వాణిలో పాలుపంచుకునే నిమిత్తం ఆదివారం ఉద‌యం ప‌వ‌న్ క‌ల్యాణ్ భీమ‌వ‌రం వెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప‌ట్ట‌ణంలో ఇటీవ‌ల ఏర్పాటు చేసిన అల్లూరి విగ్ర‌హం వ‌ద్ద‌కు వెళ్లిన ప‌వ‌న్‌... మ‌న్యం వీరుడికి నివాళి అర్పించారు.

కేంద్రం ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న ఆజాదీ కా అమృత మ‌హోత్స‌వాల్లో భాగంగా భీమ‌వరంలో స్వాతంత్య్ర స‌మ‌ర యోధుడు అల్లూరి సీతారామారాజుకు చెందిన 30 అడుగుల కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 4న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానం అందిన‌ప్ప‌టికీ ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌లు కార‌ణాల వ‌ల్ల హాజ‌రు కాలేదు. తాజాగా త‌న భీమ‌వ‌రం ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న అల్లూరి విగ్ర‌హానికి నివాళి అర్పించారు.
Go Back to Shorts
Janasena
Pawan Kalyan
Bhimavaram
West Godavari District
Alluri Seetharamaraju

More Telugu News