Venkatesh Daggubati: 100 కోట్ల క్లబ్ దిశగా 'ఎఫ్ 3'

  • క్రితం నెల 27న విడుదలైన 'ఎఫ్ 3'
  • డబ్బు చుట్టూ తిరిగే కథతో ఆకట్టుకున్న అనిల్
  • 100 కోట్ల గ్రాస్ దిశగా పరుగులు  
 F3 Movie Update

వెంకటేశ్ - వరుణ్ తేజ్ కథానాయకులుగా అనిల్ రావిపూడి 'ఎఫ్ 3' సినిమాను తెరకెక్కించాడు. క్రితం నెల 27వ తేదీన థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో ప్రేక్షకులను అలరించింది. తమన్నా .. మెహ్రీన్ .. సోనాల్ అందాల సందడి చేసిన ఈ సినిమాకి పూజ హెగ్డే సాంగ్ హైలైట్ గా నిలిచింది. 

తొలి రోజునే ఈ సినిమా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లో  ఈ సినిమా 52.01 కోట్ల  షేర్ ను .. 94.5 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 100 కోట్ల గ్రాస్ ను త్వరలో అందుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఫుల్ రన్ లో ఈ సినిమా ఎక్కడివరకూ వెళ్లి ఆగుతుందో చూడాలి.

ఈ కథ అంతా కూడా హైదరాబాద్ కి .. విజయనగరానికి మధ్య జరుగుతుంది. 'ఎఫ్ 2' సినిమాకి ఏ మాత్రం సంబంధం లేని కథతో ఈ సినిమా నడుస్తుంది. భారీ తారాగణంతో నిర్మితమైన ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేయడానికి ఇంకా ప్రమోషన్స్ కొనసాగిస్తూనే వున్నారు. 

More Telugu News