Venkatesh Daggubati: 'ఎఫ్ 3' ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్!

  • క్రితం నెల 27న థియేటర్స్ కి వచ్చిన 'ఎఫ్ 3'
  • భారీ తారాగణంతో సందడి చేయించిన అనిల్ రావిపూడి  
  • ఈ సినిమా త్వరలో ఓటీటీలో రానుందంటూ ప్రచారం 
  • ఇప్పట్లో రాదని స్పష్టం చేసిన సినిమా టీమ్  
F3 movie update

వెంకటేశ్ - వరుణ్ తేజ్ కథానాయకులుగా 'ఎఫ్ 3' సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. క్రితం నెల 27వ తేదీన విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా త్వరలో ఓటీటీలో రానుందని ప్రచారం ఊపందుకుంది. ఇలాంటి ప్రచారం జరిగితే .. 'ఎలాగూ ఇంకొన్ని రోజుల్లో  ఓటీటీకి వస్తుంది కదా' అని జనాలు థియేటర్లకు వెళ్లడం మానేస్తారు. అందువలన ఈ సినిమా టీమ్ వెంటనే రంగంలోకి దిగిపోయింది. 

అనిల్ రావిపూడి .. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ లు ఒక వీడియో చేసి వదిలారు. ఈ సినిమా 4 వారాల్లో ఓటీటీకి రాదనీ .. 8 వారాల తరువాతనే వస్తుందనే క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా థియేటర్స్ లో రన్ అవుతుందనీ .. వెంటనే వెళ్లి చూడమని చెప్పారు. మొత్తానికి కాస్త కామెడీ టచ్ ఇస్తూనే, ఈ సినిమా ఇప్పట్లో ఓటీటీలో రాదని తేల్చేశారన్న మాట.

More Telugu News