Balakrishna: అనిల్ రావిపూడి తరువాత ప్రాజెక్టును కూడా సెట్ చేస్తున్న బాలకృష్ణ!

  • గోపీచంద్ మలినేని ప్రాజెక్టుతో బిజీగా ఉన్న బాలయ్య 
  • ఆ తరువాత సినిమా అనిల్ రావిపూడితో  
  • బీవీఎస్ రవికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య 
  • 'అన్ స్టాపబుల్' పరిచయమే కారణమంటూ టాక్
Balakrishna in BVS Ravi movie

ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలోనే నడిచే కథ ఇది. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన నాయికగా శ్రుతి హాసన్ అలరించనుంది. ఈ దసరా పండుగకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 

ఆ తరువాత సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన చేయనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణను మరింత డిఫరెంట్ గా చూపిస్తానని అనిల్ రావిపూడి చెప్పడం అందరిలోను ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ తరువాత సినిమా ఏ దర్శకుడితో అనేది బాలయ్య అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో వినిపిస్తున్న పేరే బీవీఎస్ రవి. 

రచయితగా బీవీఎస్ రవికి మంచి పేరు ఉంది. ఆయాన పనిచేసిన చేసిన చాలా సినిమాలు విజయాలను అందుకున్నాయి. కాకపోతే ఆయన దర్శకత్వం వహించిన 'వాంటెడ్' .. ' జవాన్' రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఆయన వినిపించిన కథకి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం. బాలయ్య చేసిన 'అన్ స్టాపబుల్' ను డిజైన్ చేసింది బీవీఎస్ రవినే. ఆ పరిచయంతోనే బాలయ్య ఛాన్స్ ఇచ్చాడనే టాక్ కూడా వినిపిస్తోంది.

More Telugu News