2019లోనే చంద్రబాబును బాదేశారు: మంత్రి గుడివాడ అమర్నాథ్
- 'బాదుడే బాదుడు' కార్యక్రమాన్ని చేపట్టిన టీడీపీ
- చంద్రబాబును బాదాలా? అని ప్రశ్నించిన గుడివాడ అమర్నాథ్
- ఎన్నికలు జరిగిన మూడేళ్లకు చంద్రబాబుకు రాష్ట్రం గుర్తొచ్చిందని ఎద్దేవా
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. ఎన్నికలు జరిగిన మూడేళ్లకు చంద్రబాబుకు రాష్ట్రం గుర్తొచ్చిందని ఆయన విమర్శించారు. బాదుడే బాదుడు నినాదంతో చంద్రబాబును బాదాలా? అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లోనే చంద్రబాబును ప్రజలు బాదేశారని అన్నారు.
రాజకీయ అవసరాల కోసమే చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన చేపట్టారని విమర్శించారు. సింహాద్రి అప్పన్న ఆలయంలో వీడియో తీసిన ఘటనపై విచారణ జరిపిస్తామని... విచారణ అనంతరం నిజనిజాలను వెల్లడిస్తామని తెలిపారు.