Rahul Gandhi: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారు... వివరాలు ఇవిగో!

  • ఈ నెల 6న హైదరాబాద్ వస్తున్న రాహుల్
  • వరంగల్ సభకు హాజరు
  • మే 7న గాంధీ భవన్ లో 200 మంది నేతలతో సమావేశం
  • అదే రోజు ఢిల్లీకి తిరుగు పయనం
Rahul Gandhi Telangana tour schedule finalized

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 6న తెలంగాణ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది.

షెడ్యూల్...

  • మే 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి రాక.
  • శంషాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్ లో వరంగల్ పయనం.
  • వరంగలో రైతు సంఘర్షణ సభకు హాజరు.
  • రాత్రి 7 గంటలకు రాహుల్ ప్రసంగం ప్రారంభం.
  • సభ అనంతరం రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ చేరిక.
  • దుర్గం చెరువు పక్కనే ఉన్న కోహినూర్ హోటల్ లో రాహుల్ కు బస ఏర్పాటు.
  • మే 7న ఉదయం కాంగ్రెస్ ముఖ్యనేతలతో కలిసి కోహినూర్ హోటల్లో బ్రేక్ ఫాస్ట్.
  • సంజీవయ్య పార్కులో నివాళులు అర్పించే కార్యక్రమానికి హాజరు.
  • అనంతరం, గాంధీభవన్ లో 200 మంది ముఖ్యనేతలతో సమావేశం.
  • డిజిటల్ మెంబర్ షిప్ ఫొటో సెషన్ లో పాల్గొననున్న రాహుల్.
  • తెలంగాణ అమరవీరులతో కలిసి భోజనం చేయనున్న కాంగ్రెస్ అగ్రనేత.
  • సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీ పయనం. 

More Telugu News