రాహుల్ గాంధీ వరంగల్ సభ పోస్టర్ విడుదల
- మే 6న వరంగల్‌లో రాహుల్ బహిరంగ సభ
- చలో వరంగల్ పేరిట పోస్టర్ ఆవిష్కరణ
- టీపీసీసీ అధికారిక ట్విట్టర్ డీపీగా అదే పోస్టర్
ప్రజలకు రాహుల్ నమస్కారం చేస్తున్నట్లుగా ఉన్న ఫొటోపై 'మే 6 2022 చలో వరంగల్' అనే అక్షరాలను రాసిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. టీపీసీసీ అధికారిక ట్విట్టర్ ఖాతాపై ఈ పోస్టర్‌నే డీపీగా పెట్టేశారు. వచ్చే నెల 6న తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ అదే రోజున వరంగల్ బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ మరునాడు అంటే మే 7న హైదరాబాద్ రానున్న రాహుల్... పార్టీ కార్యకర్తలతో భేటీలో పాల్గొంటారు.