ఇమ్రాన్ కీలక నిర్ణయం.. జాతీయ అసెంబ్లీకి రాజీనామా
- కొత్త ప్రధాని ఎంపికను బహిష్కరించిన పీటీఐ
- ఆ వెంటనే జాతీయ అసెంబ్లీకి రాజీనామా ప్రకటించిన ఇమ్రాన్
- తనతో పాటు తన పార్టీ సభ్యులూ రాజీనామా చేస్తారని వెల్లడి
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో త్వరలో జరగనున్న నూతన ప్రధాని ఎన్నికను బహిష్కరించనున్నట్లు పీటీఐ ఎంపీలు కాసేపటి క్రితం ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన మరుక్షణమే ఇమ్రాన్ ఖాన్ నుంచి రాజీనామా ప్రకటన వెలువడింది.