చిరు కూతురు 'అమ్ములు'గా అనశ్వర.. 'కాకా' నుంచి ఫస్ట్ లుక్ విడుదల

చిరు కూతురు 'అమ్ములు'గా అనశ్వర.. 'కాకా' నుంచి ఫస్ట్ లుక్ విడుదల

Anaswara as Chiru daughter Ammulu Kaaka first look released
  • మెగాస్టార్ 'కాకా' నుంచి అనశ్వర రాజన్ ఫస్ట్ లుక్ విడుదల
  • చిరంజీవి కూతురు 'అమ్ములు' పాత్రలో నటిస్తున్న అనస్వర
  • ఆమె పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రబృందం
  • తండ్రీకూతుళ్ల అనుబంధం ప్రధానంగా సాగనున్న ఈ సినిమా
  • 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న మూవీ రిలీజ్‌
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ చిత్రం 'కాకా' నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవి కూతురిగా నటిస్తున్న మలయాళ నటి అనశ్వర రాజన్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా 'అమ్ములు' పాత్రను పరిచయం చేస్తూ ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

విడుదలైన పోస్టర్‌లో అనశ్వర రాజన్ మెడికల్ కాలేజీ విద్యార్థినిగా అమాయకమైన లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. ఆమె నవ్వుతూ కనిపిస్తుండగా, వెనుక రక్షణ కవచంలా మెగాస్టార్ చిరంజీవి నీడ కనిపిస్తోంది. ఈ పోస్టర్ కూతురి జీవితంలో తండ్రి ప్రాముఖ్యతను, వారి మధ్య ఉండే బలమైన అనుబంధాన్ని తెలియజేసేలా ఉంది. సినిమాలో ఆమె పాత్ర కథాగమనంలో చాలా కీలకమని చిత్ర యూనిట్ పేర్కొంది.

తన సహజ నటనతో మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనశ్వర రాజన్, 'ఛాంపియన్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ సినిమాలో అత్యంత ముఖ్యమైన పాత్రను దక్కించుకోవడం ఆమె కెరీర్‌కు పెద్ద ప్లస్ కానుంది.

బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. తండ్రీకూతుళ్ల భావోద్వేగాలతో పాటు మాస్ యాక్షన్ అంశాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్ప‌టికే ప్రకటించారు.
Advertisement
Anaswara Rajan
Chiranjeevi
Kaaka Movie
Bobby Kolli
KVN Productions
Tollywood News

More Telugu News