ఢిల్లీ పీజీ ప్రమాదం: కూలడానికి ముందే వీడియో తీసిన విద్యార్థినులు!
- ఢిల్లీలో పేయింగ్ గెస్ట్ భవనం కూలిన ఘటన
- కూలడానికి కొద్ది క్షణాల ముందే పగుళ్లను వీడియో తీసిన విద్యార్థినులు
- శిథిలాల కింద చిక్కుకున్న వారి అరుపులు ఇంకా వినిపిస్తున్నాయని ఆవేదన
- ప్రమాదకరంగా మారడంతో విద్యార్థినులు ఉంటున్న భవనం కూడా కూల్చివేత
- అదనపు అంతస్తుల నిర్మాణమే ప్రమాదానికి కారణమని ఆరోపణలు
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర విషాదం చోటుచేసుకోవడం తెలిసిందే. సత్య నికేతన్ ప్రాంతంలోని 'హాస్టల్‌డేజ్' అనే పేయింగ్ గెస్ట్ (పీజీ) భవనం ఆదివారం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పలువురు విద్యార్థులు, కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘోరం జరగడానికి కొద్ది క్షణాల ముందు పక్క భవనంలోని ఇద్దరు విద్యార్థినులు జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టి, ఆ దృశ్యాలను తమ ఫోన్‌లో రికార్డ్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.
కూలిన భవనానికి ఆనుకుని ఉన్న 'కనక లత' పీజీలో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినులు ఆర్నిక, మాన్సి నివసిస్తున్నారు. ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందే తమ గది గోడలు, పైకప్పుపై పెద్ద ఎత్తున పగుళ్లు రావడం, వాటి నుంచి సిమెంట్ పెచ్చులు ఊడి నీరు కారడాన్ని వారు గమనించారు. ఆందోళనతో వారిలో ఒకరు వీడియో తీస్తూ "ఈ భవనం కూలిపోయేలా ఉంది" అని అంటుండగానే, పక్కనే ఉన్న 'హాస్టల్‌డేజ్' భవనం పెను శబ్దంతో కుప్పకూలిపోయింది.
ఆ భారీ ప్రకంపనలతో భయాందోళనకు గురైన విద్యార్థినులు, తమ భవనం కూడా కూలిపోతుందేమోనన్న భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. ఇతర విద్యార్థినులను కూడా అప్రమత్తం చేశారు. శిథిలాల కారణంగా భవనం ప్రధాన ద్వారా మూసుకుపోవడంతో, అందరూ కలిసి దాన్ని బలంగా నెట్టి ప్రాణాలతో బయటపడ్డారు. "మమ్మల్ని కాపాడండి అంటూ శిథిలాల కింద చిక్కుకున్న వారు చేసిన ఆర్తనాదాలు ఇప్పటికీ మా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ ఘటన తర్వాత సరిగా నిద్ర కూడా పట్టడం లేదు" అని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రమాదం నేపథ్యంలో అధికారులు ఆర్నిక, మాన్సి ఉంటున్న భవనాన్ని కూడా ప్రమాదకరమైనదిగా ప్రకటించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) బుధవారం ఈ భవనాన్ని కూడా కూల్చివేయనుంది. అద్దె ఆదాయం కోసం నిబంధనలకు విరుద్ధంగా భవనంపై అదనపు అంతస్తులను నిర్మించడమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.