ఐపీఎల్ పై నా వ్యాఖ్యలను వక్రీకరించారు: పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా
- ఐపీఎల్ ను పీఎస్ఎల్ అధిగమిస్తుందన్న రమీజ్
- పీఎస్ఎల్ లో వేలం నిర్వహిస్తామని వెల్లడి
- ఐపీఎల్ కు ఎవరు వస్తారో చూస్తామని వ్యాఖ్యలు
- రమీజ్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు
- తాజాగా వివరణ ఇచ్చిన పీసీబీ చీఫ్
అయితే తన వ్యాఖ్యల పట్ల విమర్శలు రావడంతో రమీజ్ రాజా స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. భారత్ ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో, అదే సమయంలో పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఏంటో తనకు తెలుసని వ్యాఖ్యానించారు. పీఎస్ఎల్ ను మరింత మెరుగుపర్చేందుకు తమ వద్ద కొన్ని ప్రణాళికలు ఉన్నాయని రమీజ్ రాజా వెల్లడించారు. ఈ క్రమంలోనే వేలం ప్రక్రియను తీసుకువద్దామని అనుకుంటున్నామని, కానీ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించారు.