శర్వానంద్ గురించి హల్ చల్ చేస్తున్న రూమర్ ఇదే!

Rumours on Sharwanand
  • ఫ్యామిలీ ఆడియన్స్ లో శర్వానంద్ కి క్రేజ్ 
  • కొంతకాలంగా వరుస ఫ్లాపులు 
  • పారితోషికం తగ్గడం లేదంటూ టాక్ 
  • చేతిలో రెండు పెద్ద సినిమాలు  
టాలీవుడ్ లో నాని తరువాత వినిపించే పేరు శర్వానంద్. కథలు .. పాత్రలను ఎంచుకునే విషయంలోను, ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే విషయంలోను నాని తరువాత శర్వానంద్ కనిపించేవాడు. అయితే కొంతకాలంగా ఆయన సినిమాల ఫలితాలు నిరాశపరుస్తున్నాయి. సక్సెస్ కి చాలా దూరంలోనే ఆగిపోతున్నాయి. 

ఈ నేపథ్యంలో శర్వానంద్ చేయవలసిన ఒక మూడు పెద్ద సినిమాలు ఆయన చేజారి పోయినట్టుగా ఒక వార్త హల్ చల్ చేస్తోంది. దాదాపు అరడజను సినిమాలు పరాజయం పాలైనా శర్వానంద్ తన పారితోషికం విషయంలో ఎంతమాత్రం వెనక్కి తగ్గక పోవడం వల్లనే ఇలా జరిగిందనే టాక్ షికారు చేస్తోంది. 

నిజానికి శర్వానంద్ మొదటి నుంచి కూడా నిదానమే ప్రధానమన్నట్టుగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఎప్పుడూ ఎక్కడా కూడా ఆయన పారితోషికానికి సంబంధించిన నెగెటివ్ కామెంట్స్ వినిపించలేదు. అందువలన ఇది కేవలం రూమర్ మాత్రమే అనుకోవచ్చు. ఎందుకంటే పీపుల్ మీడియా .. యూవీ క్రియేషన్స్ వంటి పెద్ద బ్యానర్ల సినిమాలు ప్రస్తుతం ఆయన చేతిలోనే ఉన్నాయి.
Go Back to Shorts
Sharwanand
Rashmika Mandanna
Kishore Thirumala

More Telugu News