పాకిస్థాన్ పర్యటనకు వెళ్లే ముందు భావోద్వేగ పోస్ట్ చేసిన వార్నర్
- రెండు దశాబ్దాల తర్వాత పాక్ పర్యటనకు వెళ్తున్న ఆస్ట్రేలియా
- ఆసీస్ పర్యటన తర్వాత ఐపీఎల్ కు వెళ్లనున్న వార్నర్
- భార్యాపిల్లలకు దూరంగా ఉండటం కష్టమని వ్యాఖ్య
ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా వార్నర్ స్పందిస్తూ... తన భార్య, కూతుళ్లకు గుడ్ బై చెప్పడం ఎప్పుడూ కష్టంగానే ఉంటుందని అన్నాడు. గత కొన్ని నెలలుగా వారితో తాను ఎంతో విలువైన సమయాన్ని గడిపానని చెప్పాడు. కానీ ఇప్పుడు కొన్ని నెలలు మిమ్మల్ని వీడాల్సి ఉంటుందని, త్వరలోనే మనం మళ్లీ కలుసుకుందామని, అప్పటి వరకు చాలా మిస్ అవుతానని అన్నాడు.
తన భార్య పిల్లలతో ఉన్న ఫొటోలను కూడా షేర్ చేశాడు. ఈ పోస్ట్ పై వార్నర్ భార్య స్పందించింది. నువ్వు గ్రౌండ్ లో చెలరేగిపోవడాన్ని మళ్లీ చూడాలనుకుంటున్నానని చెప్పింది. మేము కూడా నిన్ను మిస్ అవుతున్నాం అని తెలిపింది.