'రంగరంగ వైభవంగా' నుంచి ఫస్టు సింగిల్ రెడీ!
- మరో ప్రేకథా చిత్రంగా 'రంగరంగ వైభవంగా'
- వైష్ణవ్ తేజ్ జోడీగా కేతిక శర్మ
- దర్శకుడిగా గిరీశాయ
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఆయన స్వరపరిచిన ఒక పాటను ఫస్టు సింగిల్ గా వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 3వ తేదీన ఫస్టు సింగిల్ రిలీజ్ కానుంది. 'తెలుసా .. తెలుసా' అంటూ ఈ పాట కొనసాగనుంది.
కేతిక శర్మకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ఇంతకుముందు ఆమె చేసిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, గ్లామర్ పరంగా ఆమెకి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలోను ఆమె అంతకుమించి అన్నట్టుగా అందాలు ఆరబోయనుందనే టాక్ వినిపిస్తోంది.
.