అంతర్జాతీయ విమాన సర్వీసులపై కీలక ప్రకటన చేసిన కేంద్రం
- ఈ నెల 15 నుంచి పునరుద్ధరించాలని భావించిన కేంద్రం
- ఇంతలో ఒమిక్రాన్ కలకలం
- అనేక దేశాలకు వ్యాప్తిస్తున్న కరోనా కొత్త వేరియంట్
- నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న డీజీసీఏ
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులు తిప్పలేమని, అందుకే నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నామని తెలిపింది. తాజా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, అంతర్జాతీయ సర్వీసుల పునరుద్ధరణ ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తామని డీజీసీఏ వివరించింది. కరోనా మహమ్మారి ఉద్ధృతి కారణంగా భారత్ లో 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.