Maharashtra: మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్.. మావోలకు పెద్ద ఎదురుదెబ్బ!

5 Maoists dead in encounter in Maharashtra
షార్ట్స్‌లో చూడండి
మహారాష్ట్రలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న గడ్చరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోలు హతమయ్యారు. ఈ ఉదయం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. వారిపై పోలీసులు ఎదుకాల్పులు జరిపారు. అనంతరం ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఐదుగురు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం. ఎన్ కౌంటర్ నేపథ్యంలో చుట్టుపక్కల అటవీప్రాంతాన్ని పోలీసులు జల్లెడ పడుతున్నారు.
Go Back to Shorts
Maharashtra
Encounter
Police
Maoists

More Telugu News