హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం.. సుమోటోగా కోర్టు ధిక్కరణ నోటీసులు
- హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై హైకోర్టు సుమోటో విచారణ
- స్టే ఉన్నా ఆస్తులు కూల్చివేయడంపై తీవ్ర ఆగ్రహం
- తమ ఆదేశాలు లేకుండానే కూల్చివేతలు జరిగాయన్న మేడ్చల్ కలెక్టర్
- రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని రంగనాథ్‌కు ధిక్కరణ నోటీసులు
- అన్ని జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ
కోర్టు స్టే ఉత్తర్వులు అమలులో ఉన్నప్పటికీ ప్రైవేటు ఆస్తులను కూల్చివేయడంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ డిజాస్టర్ అండ్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై ధిక్కరణ చర్యలను సుమోటోగా స్వీకరించింది. ఆయనకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తూ, రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది.
మేడ్చల్ జిల్లా, మల్కాజిగిరి మండలంలోని వాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పరిధిలో (సర్వే నెం. 194/1, 211) కోర్టు స్టే ఉన్నప్పటికీ కూల్చివేతలు చేపట్టారన్న ఆరోపణలపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా కలెక్టర్, మల్కాజిగిరి, తిరుమలగిరి తహసీల్దార్లు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. ఈ కూల్చివేతలకు రెవెన్యూ శాఖ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, తమ అనుమతి లేకుండానే మేడ్చల్ జిల్లాలో హైడ్రా దాదాపు 40 కూల్చివేతలు చేపట్టిందని కలెక్టర్ న్యాయస్థానానికి నివేదించారు.
దీనిపై హైడ్రా తరఫు న్యాయవాది స్పందిస్తూ, రెవెన్యూ శాఖ సూచనల మేరకే జీఎల్‌ఆర్ నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకున్నామని వివరించారు. అయితే, సరైన రికార్డులను పరిశీలించకుండా ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టడం ఆమోదయోగ్యం కాదని ధర్మాసనం స్పష్టం చేసింది.
హైడ్రా పరిధిలోని అన్ని జిల్లాల కలెక్టర్లు తమ వద్ద ఉన్న కోర్టు స్టే ఉత్తర్వుల వివరాలను తక్షణమే హైడ్రాకు తెలియజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ విషయంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని సూచించింది. హైడ్రా ఏర్పాటుకు ముందు జారీ అయిన స్టే ఉత్తర్వులను సైతం ఆ సంస్థ పరిగణనలోకి తీసుకోవడం లేదని పలు ఫిర్యాదులు వస్తున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 27వ తేదీకి వాయిదా వేసింది.