ఓటీటీలో తమిళ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్!
- తమిళంలో రూపొందిన హారర్ థ్రిల్లర్
- జూన్ 10వ తేదీన విడుదలైన సినిమా
- ఈ నెల 7వ తేదీ నుంచి మొదలైన స్ట్రీమింగ్
- ప్రస్తుతం తమిళంలోనే అందుబాటులో
- త్వరలో అందుబాటులోకి రానున్న తెలుగు ఆడియో
హారర్ థ్రిల్లర్ సినిమాలను చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడతారు. ఇక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాలనగానే మరింత కనబరచడం చేస్తుంటారు. అలా రూపొందిన ఒక తమిళ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుండటమే అందుకు నిదర్శనం. ఆ సినిమా పేరే 'డార్క్ జెయింట్'. సోనియా అగర్వాల్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, కేఎస్ కిషన్ దర్శకత్వం వహించాడు. జూన్ 10వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 7వ తేదీ నుంచి 'ఆహా తమిళ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
హీరోను సమస్యలు సతమతం చేస్తుంటాయి .. కష్టాలు వచ్చి పడుతుంటాయి. అతని కుటుంబమంతా రకరకాల ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉంటుంది. లాంటి పరిస్థితులలో అతనికి తన పూర్వీకుల బంగ్లా గుర్తుకు వస్తుంది. పాడుబడిపోయిన ఆ బంగ్లాలో నిధి ఉండే అవకాశం ఉండొచ్చని భావిస్తాడు. ఆ నిధి దొరికితే తన కష్టాలు తొలగిపోతాయని భావిస్తాడు. ఎంతో ఆశతో ఆ బంగ్లాలోకి అడుగుపెడతాడు.
అయితే ఆ బంగ్లాలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి, తనని ఎవరో గమనిస్తున్నట్టుగా అతనికి అనిపిస్తూ ఉంటుంది. అనేక రహస్యాలు ఆ బంగ్లాలో నిక్షిప్తమై ఉన్నట్టుగా తోస్తుంది. తన పూర్వీకులు చేసిన అపరాధం కారణంగా తమ వంశాన్ని ఒక శాపం వెంటాడుతోందనే విషయం అతనికి అర్థమవుతుంది. అతని పూర్వీకులు చేసిన అపరాధం ఏమిటి? శాపం ఇచ్చింది ఎవరు? దాని నుంచి అతను ఎలా బయటపడతాడు? అనేది మిగతా కథ. ప్రస్తుతం తమిళంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, త్వరలో తెలుగులోను అందుబాటులోకి రానుంది.