భారత్ లో పబ్జీ పునరాగమనం... ఈసారి కొత్త పేరుతో!

PUBG back in India with a new name
  • చైనా, భారత్ మధ్య ఘర్షణలు
  • పబ్జీని గతేడాది నిషేధించిన భారత్
  • మార్పులు చేర్పులతో కొత్త పబ్జీ తీసుకువచ్చిన క్రాఫ్టన్ సంస్థ
  • గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న గేమ్
పబ్జీ... కుర్రకారును విశేషంగా ఆకట్టుకున్న ఈ గేమ్ గతేడాది భారత్ లో నిషేధానికి గురైంది. గాల్వన్ లోయలో చైనాతో తీవ్ర ఘర్షణల నేపథ్యంలో చైనా యాప్ లపై భారత్ ఉక్కుపాదం మోపడంతో పబ్జీపైనా వేటు పడింది. అయితే భారత్ లోని తమ యూజర్లను నిరాశపర్చకుండా అప్పట్లోనే బీజీఐఎం పేరుతో ఓ గేమ్ తీసుకువచ్చిన పబ్జీ మాతృసంస్థ క్రాఫ్టన్.... ఈసారి కొత్త పేరుతో రంగప్రవేశం చేసింది.

'పబ్జీ: న్యూ స్టేట్' అనే పేరుతో ఈ కొత్త గేమ్ ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈసారి దీన్ని 17 భాషల్లో రూపొందించడం విశేషం. ప్రస్తుతం పబ్జీ: న్యూ స్టేట్ గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. దీనిపై పబ్జీ సొంతదారు కాఫ్టన్ సంస్థ స్పందిస్తూ, పబ్జీ కొత్త గేములో అధునాతన ఆయుధాలు, వినూత్న వాహనాలు, అనేక రకాల ఫీచర్లు ఉన్నాయని వెల్లడించింది.
Go Back to Shorts
PUBG
India
New Name
China

More Telugu News