'డిజిటల్ విప్లవం ఇది'... ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసిన నిర్మలా సీతారామన్
- గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిటల్ చెల్లింపులు
- గంగిరెద్దులాడించే వారూ వాడుతున్నారు
- ఓ ఎద్దుపై క్యూఆర్ కోడ్ ట్యాగ్
ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. గంగిరెద్దులాడించే వారు ఆ ఎద్దుపై క్యూఆర్ కోడ్ ట్యాగ్‌ను అమర్చారు. దీంతో ఒకరు దాన్ని స్కాన్ చేసి గంగిరెద్దులాడించే వ్యక్తికి డబ్బు సెండ్ చేశారు. ఇది గంగిరెద్దులాట రికార్డెడ్ వీడియో అని, అందులో వారు క్యూఆర్ కోడ్‌ల ద్వారా భిక్ష తీసుకుంటున్నారని నిర్మలా సీతారామన్ చెప్పారు. దేశం డిజిటల్ చెల్లింపుల విప్లవం జానపద కళాకారుల వరకూ చేరిందని ఆమె కొనియాడారు.