ఇన్నేళ్ల నా కెరియర్లో నేను చేసింది 35 సినిమాలే: బి.గోపాల్
- రీమేక్ సినిమాలు చేయడం ఇష్టం ఉండదు
- కథ నచ్చితేనే ఏ సినిమా అయినా ఒప్పుకుంటాను
- బాలయ్యతో మరో సినిమా చేయాలనుంది
- 'ఆరడుగుల బుల్లెట్' అందరికీ నచ్చుతుంది
గోపీచంద్ హీరోగా బి. గోపాల్ రూపొందించిన ఈ సినిమాను ఈ నెల 8వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. "కథ నచ్చితే తప్ప నేను ఏ సినిమాను ఒప్పుకోను. అందువల్లనే ఇన్నేళ్ల నా కెరియర్లో కేవలం 35 సినిమాలు మాత్రమే చేయగలిగాను.
అలా కథ నచ్చడం వల్లనే నేను ఈ సినిమాను మొదలుపెట్టాను. వక్కంతం వంశీ అందించిన కథ గోపీచంద్ కి కూడా బాగా నచ్చింది. మొదటి నుంచి కూడా నేను రీమేక్ సినిమాలకు వ్యతిరేకమే. కొత్త కథలతోనే సినిమాలు చేయాలనుంటుంది. అలా చేసిన ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది" అని చెప్పుకొచ్చారు.