జగన్ సీఎం అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు... పవన్ మర్చిపోయారేమో: మంత్రి కన్నబాబు
- పవన్ శ్రమదానాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు
- 12 ఏళ్లలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేకపోయారు
- వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి రాజకీయాలు చేస్తారు
జగన్ ముఖ్యమంత్రి అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటానని గతంలో పవన్ చెప్పారని... ఆ విషయాన్ని ఆయన మర్చిపోయినట్టున్నారని కన్నబాబు ఎద్దేవా చేశారు. వైసీపీపై ఏ యుద్ధం ప్రకటించారో పవన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనివాళ్లే యుద్ధం గురించి మాట్లాడతారని అన్నారు. జగన్ కు ఒక కులాన్ని ఆపాదించి లబ్ధిపొందాలని చూస్తున్నారని చెప్పారు. హైదరాబాదులో ఉంటున్న పవన్ కు ఏపీ పరిస్థితులు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు.