Nagachaitanya: 'లవ్ స్టోరీ' సక్సెస్ మీట్ కి నాగ్ .. సుకుమార్!

  • ఈ నెల 24న వచ్చిన 'లవ్ స్టోరీ'
  • థియేటర్ల దగ్గర కనిపించిన సందడి
  • తొలి రోజునే వచ్చిన సక్సెస్ టాక్
  • వసూళ్ల పరంగా కొత్త రికార్డులు
Love Story movie success meet

నాగచైతన్య కథానాయకుడిగా .. సాయిపల్లవి నాయికగా 'లవ్ స్టోరీ' సినిమా తెరకెక్కింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో అదరగొట్టేసిన ఈ సినిమా, వీకెండ్ తరువాత కూడా తన జోరును కొనసాగిస్తోంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఈ రోజున నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు. హైదరాబాద్ లోని హోటల్ 'ట్రైడెంట్'లో ఈ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ సక్సెస్ మీట్ సందడి కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి నాగార్జునను .. దర్శకుడు సుకుమార్ ను ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కొన్ని కారణాల వలన రాలేకపోయిన నాగార్జున, ఈ ఫంక్షన్ కి హాజరవుతుండడం విశేషం. నారాయణ దాస్ నారంగ్ ..  రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా, వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేయడం ఖాయమని చెప్పుకుంటున్నారు.

More Telugu News