అపోలో ఆసుపత్రికి వచ్చి సాయితేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్

Allu Arjun visits Apollo Hospital
  • ఈ నెల 10న హైదరాబాదులో రోడ్డు ప్రమాదం
  • తీవ్రంగా గాయపడిన సాయితేజ్
  • అపోలో ఆసుపత్రిలో కాలర్ బోన్ కు శస్త్రచికిత్స
  • సాయితేజ్ ఆరోగ్యపరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడిన బన్నీ
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయితేజ్ ను అల్లు అర్జున్ నేడు పరామర్శించారు. హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి అల్లు అర్జున్ విచ్చేశారు. తన బంధువైన సాయితేజ్ ను పరామర్శించిన బన్నీ... అపోలో ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్యులు బన్నీకి తెలిపారు. ఆరోగ్యం మరింత మెరుగుపడిందని వెల్లడించారు.

మెగా హీరో సాయితేజ్ కు ఈ నెల 10న హైదరాబాదులో రోడ్డు ప్రమాదం జరగడం తెలిసిందే. స్పోర్ట్స్ బైకుపై వెళుతున్న సాయితేజ్ రోడ్డుపై ఇసుక ఉండడంతో కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో సాయితేజ్ కాలర్ బోన్ విరగడంతో అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం సాయితేజ్ కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు.
Go Back to Shorts
Allu Arjun
Saitej
Apollo Hospital
Hyderabad
Tollywood

More Telugu News