మీ పేర్లు రాసిపెట్టుకుంటున్నాం.. భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు: పోలీసులకు అచ్చెన్నాయుడు హెచ్చరిక
- మా పార్టీ శ్రేణులపై పోలీసు స్టేషన్లలో లెక్కలేనన్ని తప్పుడు కేసులు
- ఇలా తప్పుడు కేసులు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నారు
- పోలీసులు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి
- చట్టం ప్రకారం నడుచుకోవాలి
కండ్రికలో తమ పార్టీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని, అయినప్పటికీ తమ కార్యకర్తలపైనే కేసులు నమోదు చేశారని ఆయన విమర్శించారు. ఇలా తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారుల పేర్లను తాము రాసిపెట్టుకుంటున్నామని, భవిష్యత్తులో వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో కొందరు పోలీసులు వ్యవహరిస్తోన్న తీరు పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు తెచ్చిపెడుతోందని అన్నారు. పోలీసులు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని, చట్టం ప్రకారం నడుచుకోవాలని ఆయన సూచించారు.