ఆఫ్ఘన్ లో మహిళల విద్యపై కీలక నిర్ణయం... అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిన తాలిబన్లు
- మహిళల విద్యకు సానుకూలత
- వర్సిటీల్లో చదువుకునేందుకు అనుమతి
- స్త్రీ, పురుషులకు వేర్వేరు తరగతులు
- స్త్రీలు ఇస్లామిక్ దుస్తులే ధరించాలని నిబంధన
ఇటీవల తాలిబన్లు ఆఫ్ఘన్ లో మరోసారి పీఠం ఎక్కిన నేపథ్యంలో యావత్ ప్రపంచం వారి తీరును గమనిస్తోంది. 1990లో తొలిసారి అధికారం చేపట్టిన సమయంలో తాలిబన్లు మహిళలకు విద్యను నిరాకరించారు. ప్రజాజీవనంలో మహిళల పాత్రను వారు తిరస్కరించారు. తాజా నిర్ణయంతో తాలిబన్లు కొద్దిమేర మెరుగైనట్టు భావించాలి.
కాగా, తాలిబన్ల తాజా నిర్ణయాన్ని ఆఫ్ఘన్ మహిళలు స్వాగతిస్తున్నట్టు తెలిసింది. కాబూల్ యూనివర్సిటీలో నిర్వహించిన ఓ సదస్సులో మహిళలు తాలిబన్ జెండాలను ప్రదర్శించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి.